జగన్ పార్టీలోకి సీనియర్ నేత హరిరామజోగయ్య?

Chegondi Hariramajogaiah
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడు చేగొండి హరిరామజోగయ్య కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశముందని తెలుస్తోంది. హరిరామజోగయ్య ఆ పార్టీలో చేరేందుకు ఇప్పటికే తన కార్యకర్తలతో మాట్లాడారని సమాచారం. ఆయన జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఏప్రిల్ 4వ తేదిన ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశముందని అంటున్నారు.

కాగా ఇటీవల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవూరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. త్వరలో మరో పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో పార్టీ అన్ని స్థానాలను అలవోకగా కైవసం చేసుకుంటుందని తద్వారా మరికొందరు ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీ నుండి తమ పార్టీలోకి వస్తారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+