తెలంగాణపై తేల్చని చంద్రబాబు, బాధపడ్డారన్న ఎర్రబెల్లి

పార్లమెంటులో బిల్లు పెట్టే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్ మిగిలిన పార్టీలను వదిలి కేవలం టిడిపినే టార్గెట్ చేస్తుందని ఎర్రబెల్లి అన్నారు. ప్రణబ్ ముఖర్జీకీ మేం తెలంగాణకు అనుకూలంగా ఇప్పటికే లేఖ ఇచ్చామన్నారు. మరోసారి ఇచ్చే అంశంపై చర్చిస్తున్నామన్నారు. రెండుమూడు రోజుల్లో మరోసారి భేటీ అయి నిర్ణయిస్తామని చెప్పారు. తెలంగాణ కోసం ప్రతిపక్ష పార్టీగా ఏవిధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలనే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. పార్టీలో అసంతృప్తి మామూలేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications