బాధ్యత గల నేతను: సూసైడ్ వ్యాఖ్యలపై సిఎం వివరణ

kiran kumar reddy
హైదరాబాద్: తాను బాధ్యత గల నేతనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం అన్నారు. తెలంగాణ కోసం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దృష్ట్యా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన శాసనమండలిలో వివరణ ఇచ్చారు. విద్యార్థుల ఆత్మహత్యలపై తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బాధ్యత గల నేతనని, బాధ్యతారహితంగా ప్రకటనలు చేయనని అన్నారు. ఆత్మహత్య ఏ కారణంతో చేసుకున్నా కుటుంబ సభ్యులు, సన్నిహితులు బాధపడతారని రాష్ట్రం కోసం ఆథ్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్న తన మాటలను మీడియా వక్రీకరించిందన్నారు.

ఎవరు ఆత్మహత్యలు చేసుకోరాదని లక్ష్యం కోసం పోరాడాలని విద్యార్థులకు సిఎం హితవు పలికారు. తెలంగాణ విద్యార్థులపై తనకెలాంటి దురుద్దేశాలు లేవని వివరించారు. విద్యార్థులపై కేసులు నమోదైతే న్యాయపరమైన చిక్కుల కారణంగానే 24 కేసులు మాత్రమే పెండింగులో ఉన్నాయన్నారు. సమ్మె సమయంలో ఉద్యోగుల ఒప్పందం అమలుకు ప్రభుత్వం జివో జారీ చేసినట్లు చెప్పారు. కాగ్ నివేదికపై స్పందిస్తూ.. భూములు దుర్వినియోగం చేసిన వారిని ప్రభుత్వం గుర్తించిందని, వారికి నోటీసులు జారీ చేసి భూములు వెనక్కి తీసుకుంటామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+