జగన్‌కు పుల్లా పద్మావతి ఝలక్, కాంగ్రెస్ గూటికే

జగన్ పార్టీ స్థాపించినప్పటి నుండి పుల్లా పద్మావతి ఆ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటికీ ఆమె దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై అభిమానంతో జగన్ పార్టీలో పని చేశారు. జగన్ చేపట్టిన పలు కార్యక్రమాలు, దీక్షల్లో ఆమె పాల్గొన్నారు. అయితే ఇటీవల కొద్దికాలంగా ఆమె పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆమె ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా కలిశారు. కాగా పుల్లా పద్మావతిని అనర్హురాలిగా ప్రకటించాలంటూ సిఎల్పీ గతంలో మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఆమె వెనక్కి తిరిగి రావడంతో ఫిర్యాదును వెనక్కి తీసుకునే అవకాశముంది.












Click it and Unblock the Notifications