హరికృష్ణ పార్టీ వీడరు, ప్రాధాన్యమివ్వాలి: మోదుగుల

టిడిపిలో ఎలాంటి లోపాలు లేవని మరో ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో దృక్పథం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాలాన్ని బట్టి రాజకీయాల్లో మార్పులు వస్తుంటాయని, దాన్ని బట్టే పార్టీ నాయకత్వం నడుస్తుందని చెప్పారు. టిడిపి రాకతోనే రాష్ట్రంలో, తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందన్నారు. టిడిపిని ముందుకు తీసుకెళ్లే నాయకత్వ లక్షణాలు చంద్రబాబుకే ఉన్నాయని రమేష్ రాథోడ్ అన్నారు. దేశంలోని ఇతర పార్టీలతో పోలిస్తే టిడిపియే బలంగా ఉందని అన్నారు. చంద్రబాబు తమ కార్యకర్తల కోసం ట్రస్టు ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. కాగా నాయకుల వల్లనే తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని హరికృష్ణ చేసిన వ్యాఖ్యలు టిడిపిని హీటెక్కించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications