ఒక్కటీ వదలొద్దు?: బైపోల్స్‌పై ఆజాద్ వ్యూహరచన

ఈ సందర్భంగా సాధ్యమైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేయాలని ఎంపీలు ఆజాద్‌కు సూచించారు. అభ్యర్థులను త్వరగా ప్రకటిస్తే గెలుపు ఖాయమని చెప్పారు. అందుకు ఆజాద్ కూడా సానూకూలంగా స్పందించారు. క్షేత్రస్థాయిలోని లోటు పాట్లను, పార్టీ పరిస్థితిపై ఆయన ఎంపీలను అడిగి తెలుసుకున్నారు. ఒక్క స్థానాన్ని కూడా వదులుకోవద్దని వారికి సూచించారు. స్థానిక సమస్యలను గుర్తించి వాటిని వెంటనే పరిష్కరించాలని ఆయన ఎంపీలను ఆదేశించారు. 18 నియోజకవర్గాలను సీరియస్‌గా తీసుకోవాలన్నారు.
అనంతరం ఉప ఎన్నికల ప్రణాళిక కోసం ఓ కమిటీని వేశారు. ఆ కమిటీలో ఒక ఎంపీ, ఒక మంత్రి, ఇద్దరు శాసనసభ్యులు, ముగ్గురు పిసిసి ప్రతినిధులు ఉంటారు. వారు స్థానిక సమస్యలపై ఓ నివేదిక తయారు చేసి పిసిసి అధ్యక్షుడికి ఇస్తారు. ఆయన ఆ నివేదికను అధిష్టానానికి పంపిస్తారు. అధిష్టానం ఆ నివేదికను పరిశీలించి అభ్యర్థిని ఎన్నుకుంటుంది. ఆ కమిటీ పదిరోజుల్లో నివేదికను ఇవ్వాలని ఆజాద్ వారికి సూచించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు లగడపాటి రాజగోపాల్ పైన పనబాక ఆజాద్‌కు ఫిర్యాదు చేశారు. లగడపాటి సర్వేల వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని ఆమె చెప్పారని తెలుస్తోంది. కాగా సీమాంధ్ర ఎంపీలతో భేటీ అనంతరం ఆయన టికాంగ్రెస్ ఎంపీలతో భేటీ అయ్యారు. కాగా ఉప ఎన్నికలు ఆగస్టులో జరిగే అవకాశముందని పార్టీ అధిష్టానం ఎంపీలకు సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications