తెలంగాణపై 4 పార్టీల అభిప్రాయం కోరాం: చిదంబరం

తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతున్న విషయం తనకు తెలుసునని, ప్రతి సంఘటనా తన దృష్టికి వస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకోవడం సరి కాదని ఆయన అన్నారు. ఆత్మహత్యల వల్ల ఒరిగేదేమీ లేదని, బతికి సాధించాలని, జీవించి పోరాటం చేయాలని ఆయన అన్నారు. రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలతో తాను టచ్‌లో ఉన్నానని ఆయన చెప్పారు. నాలుగు ప్రధాన పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చి తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తాయని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మావోయిస్టులను చర్చలకు ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications