కిరణ్, బొత్సలకు ఆజాద్ క్లాస్, ఆధిపత్య పోరుపై ఆగ్రహం

Ghulam Nabi Azad
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు సాగుతున్న నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దడానికి ఆజాద్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. వీరిద్దరితో పాటు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా ఆజాద్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి చెందిన ముగ్గురు నాయకులతో ఆజాద్ దాదాపు మూడున్నర గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. రాబోయే ఉప ఎన్నికలకు పార్టీ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు పార్టీ వ్యవహారాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.

ఆజాద్‌తో భేటీకి ముందు బొత్స సత్యనారాయణ, దామోదర రాజనర్సింహ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మాట్లాడాల్సిన విషయాలపై ఇరువురు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆజాద్ వద్దకు వెళ్లారు. కిరణ్ కుమార్ రెడ్డికి, బొత్స సత్యనారాయణకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో వారిద్దరి మధ్య సయోధ్యకు ఆజాద్ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే, దామోదర రాజనర్సింహను కలుపుకుని పోవాల్సిన అవసరాన్ని కూడా ఆయన గుర్తు చేసినట్లు చేసినట్లు చెబుతున్నారు. పార్టీ నాయకులందరినీ కలుపుకుని పోవాలని ఆజాద్ ముఖ్యమంత్రికి సూచించినట్లు తెలుస్తోంది.

ఆజాద్ నివాసానికి ముఖ్యమంత్రి సాయంత్రం ఐదు గంటలకు రాగా, ఆ తర్వాత 20 నిమిషాలకు దామోదర, బొత్స కలిసి అక్కడికి చేరుకున్నారు. సమావేశానంతరం మాత్రం ముగ్గురు కలిసి ఎపి భవన్‌కు చేరుకున్నారు. అక్కడ వీరు ముగ్గురు మళ్లీ సమావేశమయ్యారు. వచ్చే 18 స్థానాల ఉప ఎన్నికల కోసం ఏడుగురితో సమన్వయ కమిటీ వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కనీసం ఆరు సీట్లు గెలుచుకోగలిగినా పరువు దక్కుతుందనే ఉద్దేశంతో, అందుకు అనుగుణమైన వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆధిపత్య పోరు మానుకోవాలని ఆజాద్ ముగ్గురు నాయకులకు కూడా హితబోధ చేసినట్లు తెలుస్తోంది. విభేదాలతో రచ్చకెక్కితే పార్టీకి, ప్రభుత్వానికి కూడా నష్టం వాటిల్లుతుందని, ఉప ఎన్నికలను ఎదుర్కోవాల్సిన స్థితిలో అది మంచిది కాదని ఆజాద్ వారికి వివరించినట్లు తెలుస్తోంది. కాగా, ముఖ్యమంత్రిని మారుస్తారనే దాకా ప్రచారం ఊపందుకుంది. అయితే, అటువంటిదేమీ ఉండకపోవచ్చునని అంటున్నారు. అయితే, తెలంగాణపై ఆజాద్ వారితో ఏమైనా మాట్లాడారా, లేదా అనేది తెలియడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+