ఎన్టీఆర్‌నూ సొంతం చేసుకుంటున్న వైయస్ జగన్

YS Jagan
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును రాజకీయ వారసత్వాన్ని కూడా సొంతం చేసుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లున్నారు. ఆయన బుధవారం తన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని దెబ్బ తీయడానికి ఆయన ఎన్టీఆర్ వారసత్వాన్ని సొంతం చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలకు అత్యంత ఆదరణీయుడైన ఎన్టీ రామారావును సొంతం చేసుకోవడం ద్వారా తెలుగుదేశం సంప్రదాయ ఓటర్లను కూడా సందేహంలో పడేసి తన వైపు లాక్కునే ప్రయత్నాలను ఆయన ప్రారంభించారని చెప్పవచ్చు.

పేదల ప్రజల మేలు కోరింది ఎన్టీ రామారావు తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి మాత్రమేననే అభిప్రాయం కలిగించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన పథకాలకు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత గండి కొట్టారని ఆయన అప్పుడప్పుడు విమర్శిస్తూనే ఉన్నారు. అనంతపురంలో చేనేత కార్మికులపై చేపట్టిన ప్రదర్శనలో జగన్ ఎన్టీ రామారావును ప్రశంసించారు. చేనేత కార్మికులకు ఎన్టీ రామారావు మేలు చేశారని, ఆ తర్వాత వారి గురించి ఆలోచించింది వైయస్ రాజశేఖర రెడ్డి మాత్రమేనని ఆయన అన్నారు.

చంద్రబాబు ఎన్టీ రామారావు వారసత్వాన్ని కొనసాగించడం లేదని, పేరును మాత్రమే వాడుకుంటున్నారని, ఎన్టీ రామరావు నడిపినన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు లేదని, చంద్రబాబు నాయకత్వంలో పూర్తిగా మారిపోయిందని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిపార్వతి సమయం దొరికినప్పుడల్లా విమర్శిస్తూనే ఉన్నారు. నందమూరి, నారావారి కుటుంబాలకు మధ్య వారసత్వ పోరు సాగుతుందనే వార్తల నేపథ్యంలో ఎన్టీ రామారావును జగన్ సొంతం చేసుకోవడానికి ప్రయత్నించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా, తాడేపల్లిగూడెం ఎఎంసి మాజీ చైర్మన్ తోట గోపి బుధవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. వైయస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. తాడేపల్లిగూడెం నుంచి ముత్యాలపల్లి వరకు ర్యాలీగా వచ్చిన ఆయన తన అనుచరులతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్న ఆయనను జగన్ తాడేపల్లవిగూడెం నియోజకవర్గం ఇంచార్జీగా నియమించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+