రెండుసార్లు భయపడిన మాట నిజం: వైయస్ జగన్

ఈ రెండు సందర్భాల్లో నేను కొంత భయపడిన మాట నిజమేనని చెప్పారు. అయినా ప్రజలకిచ్చిన మాటకు ఇప్పటికీ కట్టుబడే ముందుకు వెళ్తున్నానని చెప్పారు. ఆయన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో మూడు రోజులపాటు ఉప ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముగింపులో భాగంగా బుధవారం రాత్రి నరసాపురంలో జరిగిన బహిరంగసభలో ఆయన కొంతసేపు ఉద్వేగంగా ప్రసంగించారు. ఓదార్పు యాత్రను విరమించుకోవాలని సోనియాగాంధీ కోరినప్పుడు అందుకు అంగీకరిస్తే తనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చే వారన్నారు.
దేశ రాజకీయాల్లో ఇమిడేలా వ్యవహరించి ఉండేవాడినన్నారు. అనేక మంది పెద్దలు ఈ విషయంలో పదేపదే బెదిరించే ప్రయత్నం చేసినా తాను తలొగ్గలేదన్నారు. నాదారిన నేను వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తనను అనుసరిస్తూ వస్తున్న ఎమ్మెల్యేలకు కూడా మీ నిర్ణయం మీరు తీసుకోండని ఆనాడే చెప్పానని జగన్ చెప్పారు.
మాటకు, నీతికి, నిజాయతీకి కట్టుబడే పార్టీ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ నీతి, నిజాయతీలతో ఆవిర్భవించిందని, దీనికే కట్టుబడి ముందుకు సాగుతామని అన్నారు. నీతికి, కుళ్లు కుతంత్రాలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ర్రాష్ట ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications