ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాలకొల్లులో చెర్రీ ఫ్యాన్స్ రచ్చ: అధ్దాలు ధ్వంసం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rachcha
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రామ్ చరణ్ తేజ్ అభిమానులు గురువారం రచ్చ చేశారు. పాలకొల్లులోని ధాత్రి థియేటర్ అద్దాలను అభిమానులు ధ్వంసం చేశారు. పట్టణంలోని ధాత్రి థియేటర్‌లో రచ్చ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే, సినిమా రీల్స్ సకాలంలో రాకపోవడంతో ప్రదర్శన నిలిచిపోయింది. దీంతో అభిమానులకు కోపం నషాళానికి ఎక్కింది. కోపించిన అభిమానులు థియేటర్ అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసిన ఆందోళనకారులను చెదరొగట్టారు.

రచ్చ సినిమా భారీ అంచనాలతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం చిరంజీవి అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు థియేటర్లకు వస్తుందా చూసేద్దామని ఆతురతతో ఉన్నారు. ఈ స్థితిలో థియేటర్‌ సకాలంలో ప్రదర్శించకపోవడం వారిని అగ్రహానికి గురి చేసింది. సినీ హీరోల అభిమానులకు ఆగ్రహం వస్తే నియంత్రించడం కొంత కష్టంగానే ఉంటుంది.

రామ్ చరణ్ అభిమానులనే కాక మాస్ సినిమాలను అభిమానించే అందరినీ అలరిస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్టు కు ప్రేక్షకులు బాగా సర్ప్రైజ్ అవుతున్నారు. అలాగే సినిమాకు పాటలు,డైలాగులు యూ.ఎస్.పి గా మారుతున్నాయని చెప్తున్నారు. ఆరెంజ్ వంటి ప్లాప్ తర్వాత వచ్చిన ఈ చిత్రంపై మెగా క్యాంప్ కి చాలా అంచనాలు ఉన్నాయి. పొరపాటున కూడా ఆరెంజ్ తరహాలో మల్టిప్లెక్స్ సినిమా కాకూడదని అన్ని జాగ్రత్తలూ తీసుకుని చేసారు.

ముఖ్యంగా చిరంజీవి కొడుకు కావటంతో ఆయన అభిమానులు చాలా మంది రామ్ చరణ్ అభిమానులు ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే చాలా చోట్ల చిరంజీవిని గుర్తు చేసేలా చేసారు. హీరోయిన్ కోసం రామ్ చరణ్ మెడికల్ కాలేజికి వెళ్లేటప్పుడు శంకర్ దాదా ఎమ్.బి.బిస్ ని గుర్తు చేస్తూ స్టైల్ మెయింటైన్ చేసారు. వానా వానా పాట అదరగొడుతుందని భావిస్తున్నారు.

English summary
Ram Charan Teja's fans attacked theatre at Palakollu of West Godavari district, as the exhibition of the film Rachcha delayed. Police intervened and controlled the situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X