సిబిఐ దర్యాఫ్తు కోరుతా: లైంగిక ఆరోపణలపై నిత్యానంద

తాను తనను విచారించే కోర్టును, హైకోర్టును సిబిఐ విచారణ చేయించాల్సిందిగా అడుగుతానని చెప్పారు. సిబిఐ విచారణ ద్వారా తన నిజాయితీని నిరూపించుకుంటానని చెప్పారు. ఏదో ఒకరోజు తన పైన వస్తున్న ఆరోపణలు తప్పని తేలుతుందన్నారు. సిబిఐ వచ్చి తనను ప్రశ్నిస్తే నా తప్పు ఏమీ లేదని నిరూపిస్తానన్నారు. ఇవి నిరాధార ఆరోపణలు అన్నారు.
తనపై ఇలాంటి ఆరోపణ ఎందుకు వచ్చిందో తాను కూడా తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పారు. దీని వెనుక ఎవరు ఉన్నారో తెలవాల్సి ఉందన్నారు. తనపై ఆరోపణలు చేసిన వ్యక్తి చిన్న పిల్లల పట్ల దుష్ప్రవర్తన కేసులో నిందితుడు అన్నారు. ఇతను యుఎస్‌లోని విచారణ ఎదుర్కొంటున్నారని అన్నారు. తాను 2010 మార్చిలో అరెస్టయ్యానని, అతను 2010 నవంబరులో అరెస్టయ్యారని గుర్తు చేశారు.
తనపై ఆరోపణలు చేసిన వ్యక్తి తాను అరెస్టయినప్పుడే బయటకు వచ్చి ఎందుకు ఆరోపణలు చేయలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఇతను కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నాడని, దానిని నుండి తప్పించుకునేందుకు తనపై ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు.












Click it and Unblock the Notifications