వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హుక్కా బార్ గుట్టు: స్మోకర్ల మధ్య టీవీ సీరియల్ నటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Mumbai Map
ముంబై: ముంబై చీకటి కార్యకలాపాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. బుధవారం రాత్రి పోలీసులు ఓ హుక్కా లాంజ్‌పై దాడి చేశారు. ఈ సందర్భంగా పోలీసులు 23 మందిని అరెస్టు చేశారు. వారిలో 19 మంది స్మోకర్లు కాగా, నలుగురు బార్ సిబ్బంది. వారి మధ్య ఓ టీవీ సీరియల్ నటి కూడా ఉన్నట్లు సమాచారం. తన చిత్రం తీయడానికి ప్రయత్నించిన మీడియాను ఆమె దుర్భాషలాడినట్లు తెలుస్తోంది. టీవీ సీరియల్ నటి స్మోక్ చేయడం లేదని తెలుస్తోంది. దీంతో ఆమెను పోలీసులు జరిమానా కూడా విధించకుండా వదిలేసినట్లు తెలుస్తోంది.

హుక్కా బార్‌లో ఉన్న నటి ఓ హిట్ టీవీ సీరియల్ బహులో నటించినట్లు తెలుస్తోంది. ఆమె పేరును, గుర్తింపును పోలీసులు రహస్యంగా ఉంచారు. ఈ సంఘటనకు సంబంధించి చాలా వివరాలు బయటకు రావాల్సి ఉంది. టీవీ సీరియల్ బహును గుర్తించడానికి ఆ సీరియల్ చూస్తే చూస్తే సరిపోతుందేమో తెలియదు. టీవీ సీరియల్ నటి ఫొటో తీయడానికి మీడియా ఫోటోగ్రాఫర్లు ప్రయత్నించారు. వీడియో కెమెరాలను కూడా తప్పించుకుంటూ ఆమె వాహనంలో వెళ్లిపోయిన దృశ్యాలు కొన్ని టీవీ చానెళ్లలో ప్రసారమయ్యాయి. కానీ ఆమె ముఖం గుర్తించడానికి వీలు లేకుండా ఉంది. హుక్కా పీలుస్తున్న 19 మందిలో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు.

పోలీసుల దాడుల్లో షోబిజ్ ప్రపంచానికి చెందినవారు అరెస్టు కావడం ఇది మొదటిసారి ఏమీ కాదు. ఇటీవల బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌ని చుట్టుముట్టారు. హుక్కా స్మోకర్స్‌తో ఉండగా పోలీసులు వివేక్‌ను పట్టుకున్నారు. ఇది ఈ ఏడాది మార్చి 29వ తేదీన మరో లాంజ్‌లో జరిగింది.

English summary
Dark affairs of the city of Mumbai once again raised its ugly head yesterday night when in a raid at a hookah lounge, cops arrested 21 party revelers who were having a blast. It is said that a TV actress who reportedly hurled abuses at the media trying to capture her image.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X