సయీద్ సవాల్: ఆధారాల కోసమే రివార్డన్న అమెరికా

అతను ఎక్కడున్నాడో మాకు తెలుసునని, పాకిస్తాన్‌లోని ప్రతి జర్నలిస్టుకు తెలుసునని చెప్పారు. ఎలా ఆయనను పట్టుకోవాలో కూడా తెలుసునని చెప్పారు. కానీ తాము ఆయనను నేరస్తుడిగా బోనులో నిలబెట్టే సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఆయనను ఆధారాలతో సహా బోనులో నిలబెట్ట కలిగితే పాకిస్తానే అతనిని అరెస్టు చేసి విచారించవచ్చునని పేర్కొంది.
మరోవైపు సయీద్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారి స్పష్టం చేశారు. అతనిని అరెస్టు చేసి బోనులో నిలబెట్టగల ఆధారలేవీ లేవన్నారు. కాగా ఇటీవల అమెరికా హఫీజ్ మహమ్మద్ సయీద్‌పై 10 మిలియన్ డాలర్ల రివార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై భారత్ హర్షం వ్యక్తం చేసింది.
అయితే దమ్ముంటే తనను పట్టుకోవాలని సయీద్ అమెరికాకు సవాల్ విసిరారు. తాను ఎక్కడున్నానో చెబుతానని, తనను పట్టుకోవాలని ఆ రివార్డ్ తనకే ప్రకటించాలని ఆమెరికాకు సూచించారు. ఆయన చేసిన సవాల్‌కు అమెరికా పై విధంగా స్పందించింది.












Click it and Unblock the Notifications