వైయస్ జగన్‌ను టార్గెట్ చేయండి: ముఖ్యమంత్రి బోధ

జగన్ వైపు వెళ్లేవారిని కట్టడి చేయాలని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఎస్సీలు ఎక్కువగా జగన్ వైపు వెళ్తున్నారని కొంత మంది నాయకులు సమావేశంలో అన్నట్లు సమాచారం. దళితుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సబ్ ప్లాన్‌ను తీసుకుని వెళ్లాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. దళితులు కాంగ్రెసును వీడకుండా ఈ ప్లాన్‌ను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ఏవీ ఆగిపోలేదని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని సూచించారు.
పార్టీకి పూర్వవైభవం వచ్చేలా కలిసి పనిచేయాలని, ఇందుకు సమన్వయం సాధించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రితో పాటు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై పార్టీ అధిష్టానం ఆసక్తితో ఉందని వారు చెప్పారు. పార్టీ విజయానికి సమన్వయంతో ముందుకు వెళ్లాలని వారన్నారు.
తమకు అనుకూలంగా లేని ఆదర్శరైతులను తొలగించాలని కూడా ముఖ్యమంత్రి సూచించినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో అవసరమైన చోట్ల ఇళ్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది. సమస్యలను తనకు చెప్తే వెంటనే పరిష్కరిస్తానని కూడా ఆయన చెప్పినట్లు సమాచారం. వైయస్ జగన్‌కు ఇప్పుడు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో కష్టమవుతుందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications