తుస్సుమనిపించారు: టి - కాగ్రెసు నేతలపై కోదండరామ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కచ్చితమైన కార్యాచరణ చేపట్టేలా కాంగ్రెసు తెలంగాణ నాయకులపై తాము ఒత్తిడి చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణపై కాంగ్రెసు ప్రకటన చేస్తే ఆత్మబలిదానాలు ఆగుతాయని తాము చెప్పామని, అయితే కాంగ్రెసు తెలంగాణ నాయకులు దాన్ని పట్టించుకోకుండా స్వలాభం కోసమే పనిచేసుకుంటూ పోతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిపోయారని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించే బాధ్యత తెలుగుదేశం పార్టీపై కూడా ఉందని ఆయన అన్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా తొలి విడతగా ఈ నెల 10వ తేదీ నుంచి ఉద్యమ యాత్రను చేపడుతామని, చర్లపల్లి నుంచి కాగడాల ప్రదర్శనతో ఈ యాత్ర పదో తేదీన ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. ఏప్రిల్ 24వ తేదీ నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు.
తమ ఉద్యమ యాత్ర 11న తాండూరు, వికారాబాద్, చేవెళ్లలో, 12న సిద్ధిపేట, 13న నిజామాబాద్ నుంచి అదిలాబాద్ వరకు సాగుతుందని ఆయన చెప్పారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీన చిన్న రాష్ట్రాల కోసం డిమాండ్ చేస్తూ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ర్యాలీలు, సభలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ కాంగ్రెసు నేతల సమావేశాలు తమను నిరుత్సాహపరిచాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications