చంద్రబాబుపై విరుచుకుపడిన వైయస్ జగన్ పార్టీ నేత

ప్రత్యేక ఆర్థిక మండళ్లకు (సెజ్‌లకు) కేటాయించిన భూములపై పోరాటం చేస్తామని చెబుతున్న చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపులపై ఏమంటారని ఆయన అడిగారు. చంద్రబాబు కేటాయించిన భూముల్లో జెండాలు పాతిన తర్వాత భూపోరాటాలు చేయాలని ఆయన సూచించారు. పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ తరహా పోరాటాలు చేస్తామని చంద్రబాబు అనడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. చంద్రబాబును సెస్ నివేదిక కూడా తప్పు పట్టిందని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ విధానాల్లో స్పష్టత, స్థిరత్వం లేదని ఆయన అన్నారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడున పూటకో మాట మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఏ విధానాలతో చంద్రబాబు ప్రజల ముందుకు వెళ్తారో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు బడా బాబులకు భూములు కట్టబెట్టారని ఆయన అన్నారు.
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాజకీయ పునాదులు కదులుతున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మరో నేత బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు. భయంతో బొత్స సత్యనారాయణ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. బొత్స సత్యనారాయణ మహిళలను అవమానపరిచాడని ఆయన ఆరోపించారు. మహిళలకు క్షమాపణ చెప్పాలని ఆయన బొత్స సత్యనారాయణను డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications