సలేశ్వర ఉత్సవాల్లో తొక్కిసలాట, ఇద్దరు మృతి

ఏటా చైత్ర పౌర్ణమి నాడు జరిగే సలేశ్వర జాతరకు పెద్ద యెత్తున భక్తులు తరలివస్తారు. కొండలు, గుట్టల మధ్య వేయి అడుగుల లోతులో ఉన్న లింగమయ్యను దర్శించుకుంటారు. అక్కడ ఎత్తైనకొండలు, చెట్లు, పచ్చదనాలతో ఆహ్లాదకరమైన వాతావరణం ప్రజలను ఆకట్టుకుంటుంది. అదే విధంగా ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అయితే లక్షలాది మంది భక్తులు వస్తున్నా ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.
సల్వేశ్వరం ఉత్సవాలకు సరిగా ఏర్పాట్లు కూడా లేవని తెలుస్తోంది. సలేశ్వర లింగమయ్యను దర్ఛించుకోవడానికి చేసే యాత్ర సాహసోపేతమైందనే అంటారు. దట్టమైన నల్లమల అడవుల్లో ఈ లింగమయ్య ప్రార్థనా స్థలం ఉంది.












Click it and Unblock the Notifications