కాళేశ్వర్ బాబా ఆభరణాలు మాయం, ఆస్తి ఖాళీ

ఆంధ్రజ్యోతి దినపత్రిక వార్తాకథనం ప్రకారం - బాబాను గతనెల 14న ఆస్పత్రిలో చేర్చగానే ఆయన గదులకు తాళం వేశారని, కలెక్టర్‌కు విన్నవించుకోవడంతో ఆర్డీవో ద్వారా 11 మంది సభ్యులు లోనికి వెళ్లి ఈ నెల 5న గదుల తాళం తీసి బీరువాలు తెరచి చూశారన్నారు. బీరువాల్లో బాబా ఆభరణాలు ఏమీ లేవని, కోట్ల రూపాయల ఆభరణాలు కనిపించకుండా పోయాయని చెప్పారు. ఆరు అడుగుల ఆంజనేయస్వామి విగ్రహానికి 5 కేజీల బంగారు కిరీటం, గద, కవచం.. ఇవేవీ లేవని తెలిపారు. షిరిడీ సాయి విగ్రహానికి చెందిన హారం, వెండి ఆభరణాలు కూడా లేవన్నారు. కాళేళ్వర్ చేతికి ఉండాల్సిన ఉంగరాలు, ఆయనకున్న రెండు బంగారం బెల్టులలో ఒక బెల్ట్, బ్రాస్‌లెట్లు కూడా కనిపించడం లేదని వివరించారు.
ఆశ్రమం బయట భారీ బందోబస్తు ఉన్నా ఇలా జరిగిందంటే ఏదో పథకం ఉన్నట్లు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఒకరోజులో జరిగింది కాదని, పద్ధతి ప్రకారం జరుగుతూ వచ్చిందని అన్నారు. కాళేశ్వర్ ఆస్తులు ఆశ్రమానికి చెందాలని, ఆశ్రమం ద్వారా సేవలందించి ఆయన సంకల్పం నెరవేర్చాలని చెప్పారు. ప్రభుత్వం ఈ ఆస్తులు కాపాడేందుకు సీబీఐతో విచారణ చేయించాలన్నారు. ఆశ్రమ నిర్వహణకు ప్రతినెలా రూ.10 లక్షలు ఖర్చవుతుందని, ఆస్తులు అన్యాక్రాంతమైతే ఆశ్రమ నిర్వహణ కుంటుపడుతుందని ఆవేదన వెలిబుచ్చారు.
కాళేశ్వర్ ఆశ్రమ గదులను కలెక్టర్ ఆదేశాలతో తెరిచారని, ఈ 11 మంది సభ్యుల్లో నలుగురు విదేశీయులు, ఒక లాయర్, ఒక ఆడిటర్, ఆశ్రమ మేనేజర్ చంద్రమౌళిరెడ్డితో పాటు కాళేశ్వర్ తల్లి సుబ్బమ్మ, అల్లుడు రూపేష్‌కుమార్, భార్య శిల్ప, ఆమె తండ్రి భాస్కర్‌రెడ్డి ఉన్నారని ఆయన చెప్పారు.
తమ కుటుంబసభ్యులు ఆశ్రమంలో ఉండగా కొందరు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని సుబ్బరాయుడు ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆంధ్రజ్యోతి రాసింది. తన ముగ్గురు కుమార్తెలలో శైలజకు బెదిరింపు ఫోన్‌లు వచ్చాయని, వాటిలో కొన్ని అమెరికా నుంచి వచ్చినట్లు భావిస్తున్నామన్నారు. తనకు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సుబ్బరాయుడు కుమార్తె శైలజ ఫోన్‌లో తెలిపారు. బెదిరింపులు ఏ ఫోన్ నెంబర్ల నుంచి వచ్చాయో కూడా ఆంధ్రజ్యోతి పత్రిక తెలిపింది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications