నా పేరులో బంగారముందన్న డ్రీమ్ గర్ల్ హేమమాలిని

Hema Malini
బెంగళూరు: తన పేరులోనే బంగారం ఉందని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యురాలు, డ్రీమ్ గర్ల్ హేమ మాలిని ఆదివారం అన్నారు. ఆమె బెంగళూరులో ఓ నగల దుకాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నగలంటే ఇష్టం లేని మహిళలు ఎవరూ ఉండరని చెప్పారు. తన పేరులోనే బంగారం ఉందన్నారు.

సంప్రదాయ నగలు అంటే తనకు మరీ ఇష్టమని చెప్పారు. జూన్‌లో తన కుమార్తే ఈషా డియోల్ వివాహం ఉంటుందని, ఆ వివాహానికి కావాల్సిన నగలు, దుస్తులను మే నెలలోనే కొనుగోలు చేస్తామని చెప్పారు. తన దుస్తుల డిజైనర్లు రూపొందించే డిజైన్ల ఆధారంగా నగలను ధరించేందుకు ఇష్టపడతానని ఆమె చెప్పారు.

అన్ని రకాల నగలను తాను ఇష్టపడినా కాసుల పేరు, మామిడి పిందెల హారం మరీ ఇష్టమని చెప్పారు. తాను చిత్రాల్లో నటించే సమయంలో డ్రీమ్ గర్ల్ అని పిలవడం కన్నా నటించడం తగ్గించిన తర్వాతే ఎక్కువ మంది అలా పిలుస్తున్నారన్నారు. ఇప్పుడు అలా పిలిచే వారి సంఖ్య ఎక్కువయిందన్నారు.

మంచి అవకాశం వస్తే పూర్తి స్థాయిలో నటనకు అభ్యంతరం లేదన్నారు. నటనకు అవకాశాలు తగ్గినా, నాట్యంతో సంతృప్తి చెందుతున్నానని ఆమె తెలిపారు. కాగా హేమ మాలిని ఆదివారం బెంగళూరు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+