అవినీతిపరులు జైలుకెళ్లడం ఖాయం: కెఏ పాల్ జోస్యం

త్వరలో జరగనున్న పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గాలలోనూ అభ్యర్థులను నిలబెట్టే విషయంపై పార్టీలో చర్చిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉప ఎన్నికలు జరగబోయే నియోజకవర్గాలలో కొన్నిచోట్ల ప్రజాశాంతి పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెడతామని ఆయన చెప్పారు.
కాగా ఇటీవల గుంటూరు జిల్లాలో పర్యటించిన కెఏ పాల్ రానున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టే యోచనలో ఉన్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. అభ్యర్థులను నిలబెట్టే విషయమై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అప్పుడు చెప్పారు. ఒకవేళ పోటీ చేయని పక్షంలో ఏ పార్టీకి మద్దతిస్తామో అప్పుడే తెలియజేస్తామని ఆయన అన్నారు. అదే సమయంలో తనను వేధించి, బాధించిన వారు పోయారని చెప్పడం గమనార్హం.
పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమంటుకు జరగనున్న అన్ని నియోజకవర్గాలలో తాను త్వరలో పర్యటిస్తానని కెఏ పాల్ చెప్పారు. ఎన్నికలయ్యాక పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు. కాగా కెఏ పాల్ ప్రజాశాంతి పార్టీ స్థాపించిన అనంతరం పార్టీ పరంగా కార్యక్రమాలు చేసింది తక్కువే అని చెప్పవచ్చు. అయితే త్వరలో జరగనున్న ఎన్నికల్లో పాల్గొంటానని చెప్పడం ద్వారా తన పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశ్యం ఆయనలో కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications