దండుకుంటున్నాడు:మంత్రి పార్థసారథిపై దేవినేని ధ్వజం

పంటలకు గిట్టుబాటు ధరలు లేక రాష్ట్రంలో రైతాంగం అల్లాడుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని వారు ధ్వజమెత్తారు. కేంద్రం పొరుగు రాష్ట్రాలకు సాయం చేసి ఆంధ్రప్రదేశ్‌ను విస్మరిస్తున్నా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులకు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. 32 మంది ఎంపిలు ఢిల్లీలో కూర్చుని గడ్డి పీకుతున్నారా అని మండిపడ్డారు.
అందరికీ అన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్రా అని గగ్గోలు పెడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కుర్చీల కొట్లాటలో మునిగిపోయారన్నారు. ఇప్పటికైనా సిసిఐని రంగంలోకి దింపి పత్తిని, మార్క్‌ఫెడ్ ద్వారా పసుపును గిట్టుబాటు ధరలకు కొనిపించాలని డిమాండ్ చేశారు.
డిఇవో పోస్టింగులకు రూ.20 నుంచి 25 లక్షల వరకూ పార్థ సారథి వసూలు చేస్తున్నారని దేవినేని ఆరోపించారు. ఇప్పటికే మూడు కోట్లు సంపాదించారన్నారు. బదిలీలపై ఎసిబితో విచారణ జరిపించాలని, మంత్రిని డిస్మిస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తమ జిల్లాలో రెండు పాఠశాలకు చెందిన 140 మంది పదో తరగతి విద్యార్థులకు చివరి నిమిషం వరకు హాల్ టికెట్లు ఇవ్వకుండా మంత్రి వేధించారని, తనకు రూ.10 లక్షలు, విద్యా శాఖ అధికారులకు రూ.10 లక్షలు ఇవ్వాలని పాఠశాల యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications