యుద్ధం ఎప్పుడు వచ్చినా భారత్ సిద్ధమే: ఎకె ఆంటోనీ

ప్రస్తుతం ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. సైనికులకు సరిపడా ఆయుధాలు ఉన్నాయని చెప్పారు. సైన్యం ఎప్పుడూ సర్వసన్నద్ధంగా ఉంటుందని ఆయన చెప్పారు. భారత సైన్యం వద్ద యుద్ద పరిస్థితుల్లో కేవలం పది రోజులకు సరిపోయే మందుగుండు మాత్రమే ఉందని వార్తలు వచ్చాయి.
ఆయుధాల కొరతపై ఆంటోనీ మాట్లాడుతూ ఎప్పుడూ సమస్య ఉంటుందని, అయితే దేశం గతంలో కంటే బలంగా ఉందన్నారు. కొరత కేవలం ప్రచారం మాత్రమేనని ఆయన అన్నారు. భారత్ పూర్తిగా సన్నద్ధంగా ఉందని చెప్పారు.
రక్షణపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశమైన రోజు తర్వాత ఆయన ప్రకటన వెలువడింది. ఈ కమిటీలో సైన్యం, ఎయిర్ ఫోర్స్, నావికా దళ చీఫ్‌లను పిలిచేందుకు కమిటీ నిర్ణయించింది. జనరల్ వికె సింగ్ అంశం నేపథ్యంలో ఆర్మీని సమాయత్తపరిచేందుకు పిలవాలని నిర్ణయించింది. లోపాలను, కొరతను వారి నుండి అడిగి తెలుసుకోనుంది.












Click it and Unblock the Notifications