బాబు స్కూల్లో ఆ పాఠాలే, అవి మాకొద్దు: బొత్స కౌంటర్

Botsa Satyanarayana
తిరుపతి: తాను, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిన్న పిల్లల్లా కొట్లాడుకుంటున్నారన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు మాకు మాస్టర్ లాగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన నుండి మేం రాజకీయ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని ధ్వజమెత్తారు.

ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. బాబు స్కూల్లో అన్నీ ప్రజా వ్యతిరేక పాఠాలే ఉంటాయని చెప్పారు. అందుకే ఆయన పాఠాలు తమకు అవసరం లేదని చెప్పారు. మేం ప్రజలకు దగ్గరయ్యేలా ఉంటున్నామని, కానీ ఆయన పాఠాలు మాత్రం ప్రజలకు చెక్ చెప్పేలా ఉంటాయని విమర్శించారు. అలాంటి పాఠాలు మాకు అవసరం లేదన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు పార్టీ నాయకుడే అన్నారు. ఆయన ఫోటోను మేం ఉపయోగించుకుంటామని చెప్పారు. ఉప ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల లోపు రావొచ్చు లేదా రాకపోవచ్చునని చెప్పారు. ఉప ఎన్నికలు ఎన్నికల సంఘం చేతిలో ఉంటుందని, స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పారు. త్వరలో స్థానిక ఎన్నికలు ఉంటాయని చెప్పారు.

తిరుపతి నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీ తరఫున మంచి అభ్యర్థిని పరిశీలించి త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. టిక్కెట్లు ఆశించే వారు ఎక్కువగా ఉండటంతో అభ్యర్తి ఎంపికలో జాప్యం జరుగుతోందన్నారు. జరగబోయే ఉప ఎన్నికలలో అభివృద్ధే తమ ప్రధాన ప్రచార అజెండా అని చెప్పారు. అత్యధిక స్థానాలు కాంగ్రెసు పార్టీ సొంతం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+