చిరంజీవి కాదు బాబు పారిపోయారు: సి.రామచంద్రయ్య

చిరంజీవిపై వ్యక్తిగత దూషణలకు దిగటం చంద్రబాబు ఆయన స్థాయిని దిగజార్చుకోవడమేనని సూచించారు. చిరు పారిపోలేదన్నారు. చంద్రబాబు చంద్రగిరి నుండి కుప్పంకు పారిపోయారని ఎద్దేవా చేశారు. సొంత ఊరు చంద్రగిరిలో ఓడిపోయిన బాబు ఆ తర్వాత కుప్పంకు పారిపోయాడని విమర్శించారు.
చిరుపై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలన్నారు. లేదంటే ఆయన చరిత్ర తవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆయన చరిత్ర తవ్వి తీస్తే బాగోతాలు కోకోల్లలు ఉన్నాయన్నారు. ఆయన పచ్చి అవకాశవాది అన్నారు. చిరుపై వ్యక్తిగతంగా మాట్లాడే సంస్కృతి నుండి ఆయన బయటకు రావాలన్నారు. తిరుపతి అభివృద్ధికి చిరంజీవి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ఆయనను విమర్శించే నైతిక అర్హత బాబుకు లేదన్నారు.
గతంలో చంద్రబాబే మంత్రులను రాజీనామా చేయించి రాజ్యసభకు పంపిన విషయం గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఇతర పార్టీల నుండి నేతలను ఆహ్వానిస్తే బాబు వలసల పార్టీ అని విమర్శించారు, మరి ఆయన ఇప్పుడు అదే పార్టీ నేతలను టిడిపిలోకి ఎందుకు ఆహ్వానిస్తున్నారని అడిగారు.












Click it and Unblock the Notifications