సాయి ప్రతాప్, డిఎల్ రవీంద్రా ఝలక్: భేటీకి డుమ్మా

Sai Prathap
కడప: కాంగ్రెసు పార్టీకి ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు, మాజీ కేంద్ర సహాయ మంత్రి సాయి ప్రతాప్ షాక్ ఇచ్చారు. కడప జిల్లాలోని రాజంపేటలో మంగళవారం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నిర్వహించిన కాంగ్రెసు పార్టీ కార్యకర్తల సమావేశానికి ఎంపి సాయి ప్రతాప్ గైర్హాజరయ్యారు. సాయి ప్రతాప్ రాకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి కూడా భేటీకి దూరంగా ఉన్నారు.

కాగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని పక్కన పెట్టాలని కాంగ్రెసు పార్టీ నిర్ణయించుకున్నదనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వైయస్‌ను పక్కన పెట్టకుంటే అది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూరుస్తుందని కాబట్టి ఆయనను పక్కకు పెట్టడమే సముచితమని పార్టీలోని కొందరు నేతలు ఇటీవల జరిగిన సమన్వయ కమిటీలో చెప్పిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత పార్టీ నేతలు పలువురు వైయస్ పైన విమర్శల జోరు పెంచారు. ఇప్పటికే పలువురు నేతలు మొదటి నుండి వైయస్ పైన విరుచుకు పడుతున్నారు. తాజాగా పార్టీలోని అందరూ జగన్‌కు లబ్ధి చేకూరకుండా వైయస్‌ను టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నారనే వార్తల తర్వాత ఆ జోరు పెరిగిందనే చెప్పవచ్చు. మంత్రి కొండ్రు మురళీ మోహన్ తదితర నేతలు వైయస్ హయాంలో దళితులకు అన్యాయం జరిగిందని చెబుతున్నారు.

వైయస్‌ను టార్గెట్ చేసుకోవడంపై ఆయన సోదరుడు, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి అసంతప్తి వ్యక్తం చేశారు. వైయస్‌ను పార్టీ విమర్శిస్తే తాను వ్యతిరేకిస్తానని చెప్పారు. నేతలపై ఆయన మండిపడ్డారు. ఎంపి సాయి ప్రతాప్ కూడా ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. వైయస్‌ను తిడితే ఊరుకునేది లేదని చెప్పారు.

వైయస్ అంశం ఈ ఇద్దరిని కాంగ్రెసుకు దూరం చేస్తుందా అనే చర్చ కూడా కాంగ్రెసులో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సాయి ప్రతాప్ గైర్హాజరీ చర్చనీయాంశమైంది. కాగా బొత్స 10, 11 తేదీలలో జిల్లాలో పర్యటిస్తారు. రాయచోటీ, రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాలపై ఆయన ఉప ఎన్నికల కసరత్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+