తారా చౌదరి కాల్ లిస్టు డేటా తెప్పించుకున్న పోలీసులు

తారా చౌదరిని పోలీసులు మహిళా పోలీసుల సమక్షంలో విచారిస్తున్నారు. ఇప్పటికే రెండు రోజులు గడిచిపోయాయి. మరో రెండు రోజుల గడువు ఉంది. ఈ రెండో రోజుల్లో ఆమె ఏ విషయాలు చెబుతుందనే విషయంపై ఆసక్తి నెలకొని ఉంది. తారా చౌదరి ప్రకాశం జిల్లా కమ్మవారిపాలెం గ్రామంలో అన్నదానం చేస్తూ దిగిన ఫోటోలను ఓ తెలుగు టీవీ చానెల్ మంగళవారం ప్రసారం చేసింది.
తారా చౌదరికి చెందిన 43 ఆడియో, వీడియో రికార్డింగులను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తారా చౌదరి బడా బాబులకు ఫోన్లు చేసి గంటలకు గంటలు మాట్లాడేదని, కొంత మందిని బ్లాక్ మెయిల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఆమె బడా బాబుల సహకారంలో చక్రం తిప్పినట్లు చెబుతున్నారు. తారా చౌదరి నుంచి రాబట్టిన విషయాలతో పోలీసులు కేసును ఎలా ముందుకు నడిపిస్తారనే విషయంపై ఉత్కంఠ నెలకొని ఉంది.
కాగా, తనను పోలీసులు కావాలని కేసులో ఇరికించారని తారా చౌదరి అంటోంది. బెయిల్‌పై తాను బయటకు వచ్చిన తర్వాత అన్ని విషయాలు చెబుతానని ఆమె అంటోంది. తాను ఎవరినీ బ్లాక్ మెయిల్ చేయలేదని, తాను ఏ తప్పూ చేయలేదని ఆమె చెబుతోంది. శ్రీలక్ష్మి అనే విశాఖపట్నం అమ్మాయి ఆమె చెర నుంచి తప్పించుకుని మీడియాకు ఎక్కడంతో తారా చౌదరిని, ఆమె భర్త ప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications