మాయావతికి అఖిలేష్ షాక్!, అవినీతిపై కమిటీ

కాగా మాయావతి హయాంలోని అవినితిపై కమిటీ అనేది ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన సాధారణ ఎన్నికలలో సమాజ్ వాది పార్టీ ఇచ్చిన హామీలలో ఒకటి. వివరాల ప్రకారం.. మాయావతి అవినీతిపై వేయబోయే కమిటీలో రిటైర్డ్ హైకోర్టు జడ్జి, విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో విచారణ జరిపే అవకాశముంది.
మాయావతి హయాంలో భారీగా కుంభకోణాలు జరిగాయనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె అవినీతితో డబ్బులు సంపాదించి రాష్ట్రంలో భారీగా తన విగ్రహాలు పెట్టించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఓ విమానాన్ని ప్రత్యేకంగా ముంబయి పంపించి చెప్పులు తెప్పించుకున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా వ్యక్తిగతంగానే కాకుండా ప్రభుత్వంలోనూ భారీ అక్రమాలు జరిగాయనే వారు ఉన్నారు.
తాము అధికారంలోకి వస్తే మాయావతి ప్రభుత్వంలోని అక్రమాలపై విచారణ జరిపిస్తామని అఖిలేష్ యాదవ్ ఎన్నికల ప్రచారం సమయంలో హామీ ఇచ్చారు. అయితే మాయావతి విగ్రహాలను మాత్రం కూల్చబోమని చెప్పి అందరి ప్రశంసలు అందుకున్నారు.












Click it and Unblock the Notifications