అమ్మేస్తున్నాడంటూ తండ్రిపై కేసు పెట్టిన అమ్మాయి

Uttar Pradesh Map
లక్నో: తనను, తన సోదరిని తన తండ్రి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ మైనర్ బాలిక పోలీసులను ఆశ్రయించిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్ షహర్‌లో ఈ ఘటన జరిగింది. తన తండ్రి తనను, తన సోదరిని అమ్మేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని జ్యోతి అనే అమ్మాయి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

అయితే పోలీసుల విచారణలో నిజంగానే వారిద్దరిని సదరు తండ్రి ఎనబై వేల రూపాయలకు అమ్మివేసినట్లు తేలింది. గ్రామస్తులు, పోలీసులు జోక్యం చేసుకొని పిల్లలకు భద్రత కల్పించారు. జ్యోతి స్వగ్రాం బులంద్ షహర్ దగ్గర్లోని జఖైటా. ఈమె వయస్సు పదిహేను. ఈమె చెల్లెలు పూనమ్ వయస్సు పద్నాలుగు.

వీరినే తండ్రి అమ్మేందుకు యత్నించాడు. జ్యోతి ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు ఆయన పై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అతను తన పిల్లలను అమ్మేందుకు ప్రయత్నించినట్లు గ్రామస్తులు కూడా పోలీసులకు చెప్పారు. కాగా ఆడపిల్ల పట్ల అమానుషాలు రోజు రోజుకు హెచ్చు మీరిపోతున్నాయనడానికి ఈ సంఘటన కూడా ఒక నిదర్శనం. దేశంలో చాలామంది ఆడపిల్లు పుట్టగానే దూరం చేసుకుంటున్నారు.

మరికొందరు వారు పెరుగుతున్న క్రమంలో దూరం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండేళ్ల పసిబిడ్డ ఫలక్ రోజుల తరబడి మృత్యువుతో పోరాడి ఓడిన ఘటన ఇంకా మరుగున పడకముందే ప్రస్తుతం ఓ రోజుల పసికందు తండ్రి అమానుషం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

అలాంటిదే మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌లో ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఆడపిల్ల పుట్టిందని ఆగ్రహించిన తండ్రి రెండు రోజుల పసికందు నోట్లో నికోటిన్ వేసి కన్నుమూసేందుకు కారణమయ్యాడు. ఇది గత సంవత్సరం జరిగింది. పోస్టుమార్టం నివేదిక ఇటీవలె అందడంతో సదరు తండ్రిని పోలీసులు మంగళవారం అరెస్టు చేసి జైలుకు పంపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+