రాసలీలలు రికార్డు చేసిన తారా చౌదరి: హనీఫ్ పనే

తారా చౌదరి పనుపు మేరకు హనీఫ్ అనే వ్యక్తి ఆడియో, వీడియో రికార్డులు చేసేవాడని అంటున్నారు. అతని ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు వేట ప్రారంభించారు. అతను పట్టుబడితే కీలకమైన విషయాలు బయటపడుతాయని అంటున్నారు. తారా చౌదరి వద్ద పలువురు విఐపిల చిట్టా ఉన్నట్లు తెలుస్తోంది. విఐపిల్లో ఎక్కువగా వ్యాపారులు ఉన్నట్లు సమాచారం.
కస్టమర్లకు ఒక్కొక్కరికి ఒక్కో రేటు ఉండేదని అంటున్నారు. లెక్కలేనంత మంది వ్యాపారులు ఆమె వద్దకు వచ్చేవారని అంటున్నారు. తెలంగాణ, రాయలసీమలకు చెందిన ఒక్కరేసి పార్లమెంటు సభ్యులతో, ఇద్దరు ఆంధ్ర పార్లమెంటు సభ్యులతో, ఆరుగురు శానససభ్యులతో తారా చౌదరికి సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. తనను రాజకీయ నేతలు బెదిరిస్తున్నారని కూడా తారా చౌదరి మంగళవారం చెప్పింది.
నాలుగు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకుని తారా చౌదరిని పోలీసులు విచారించారు. అయితే, ఆమె వారి ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని అంటున్నారు. కస్టడీ ముగిసిపోవడంతో పోలీసులు ఆమె బుధవారం కోర్టులో ప్రవేశపెట్టారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ ఎసిపి శంకర్ రెడ్డి తనను వేధించారని తారా చౌదరి కోర్టుకు తెలిపింది. తన పట్ల శంకర్ రెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడని కూడా ఆమె ఆరోపించింది. కొన్ని సీడీలను చూపించి పోలీసులు తనను బ్లాక్ మెయిల్ చేశారని ఆమె ఫిర్యాదు చేసింది. తారా చౌదరికి కోర్టు ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications