తండ్రి హత్య, పోలీసుల అదుపులో బాలీవుడ్ యాక్టర్

అనుజ్ టిక్కును, అతని మిత్రుడిని పోలీసులు మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నామని, అనుజ్ తండ్రి హత్యపై వారిని విచారిస్తున్నామని పోలీసు అధికారులు చెప్పారు. తండ్రి హత్యకు గురైనప్పటి నుంచి అనుజ్ కనిపించకుండా పోయాడని అంటున్నారు.
అరుణ్ కుమార్ టిక్కు ఘజియాబాద్‌కు చెందినవాడు. ఆయనకు 62 ఏళ్లు. తన కుమారుడు అనుజ్ పాలు పంచుకుంటున్న ఓ వ్యాపార వ్యవహారంలో అతను ముంబై వచ్చాడు. అనుజ్ ఈవెంట్స్, టీవీ కమర్షియల్స్, రేడియో కంటెంట్ వంటి వ్యవహారాల వంటి వ్యాపారాలు నడిపిస్తున్నాడు.
అనుజ్ మానసిక సమస్యతో బాధపడుతున్నాడని, అతను గత నాలుగేళ్లుగా జైపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, తండ్రి వదిలేయడంతో ఒంటరిగా ఉంటున్నాడని పోలీసులు చెప్పారు. ముంబైలోని అంధేరీలోని ఓ అద్దె అపార్టుమెంటులో అనుజ్ ఉంటున్నాడు. శనివారం నుంచి అతను కనిపించడం లేదు. తండ్రి హత్య గురించి తనకు తెలియదని అనుజ్ అంటున్నాడు. హత్య కేసులో అనుజ్ ప్రధాన అనుమానితుడని, సాక్ష్యాల సేకరణకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications