తండ్రి కిరాతకం: మూడు నెలల బేబీ అఫ్రీన్ మృతి

ఆఫ్రీన్ శరీరం లోపల రక్తస్రావం జరిగిందని వైద్యులు చెప్పారు. విపరీతమైన గాయాలతో అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో బేబీ అఫ్రీన్‌ను ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. ఆమెపై తండ్రి కిరాకతంగా దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. పాపను హింసించిన ఆరోపణలపై అతను ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు. బుధవారం ఉదయం పాప పరిస్థితి విషమించింది.
పాప పరిస్థితి కాస్తా విషమించిందని, నిన్న ఫిట్స్ వచ్చాయని వైద్యులు చెప్పారు. ఆమె పరిస్థితి బాగా లేదని చెప్పారు. బుధవారం ఉదయం పాపను వెంటలేటర్‌పై ఉంచి బతికించడానికి వైద్యులు ప్రయత్నించారు.
ఆడబిడ్డ పుట్టిందనే కోపంతో తండ్రి అఫ్రీన్‌ను చిత్రహింసలకు గురి చేశాడు. ఆమె శరీరంపై కొరికిన గుర్తులున్నాయి. నుదుటిపై సిగరెట్‌తో కాల్చిన మరకలున్నాయి. ఆస్పత్రికి తీసుకుని వచ్చినప్పుడు ఆ పాప పరిస్థితి అది. ఆడబిడ్డపై వ్యతిరేకతతో మగబిడ్డపై మక్కువతో ఆ తండ్రి పైశాచికత్వానికి, అమానుషత్వానికి పాల్పడ్డాడు.












Click it and Unblock the Notifications