జగన్ ముందు మేం వెనుక: 'వైయస్'పై టిజి వెంకటేష్

వైయస్ కాంగ్రెసు పార్టీ నేత అయినప్పటికీ ఆయనను పేటెంట్ చేసుకోవడంలో కాంగ్రెసు పార్టీ వెనక పడిందన్నారు. ఆయన ఇమేజ్‌ను జగన్ సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి విషయంలో మా పార్టీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వైయస్ రాజశేఖర రెడ్డి పైన వస్తున్న విమర్శలకు ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని సూచించారు. ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర రెడ్డి కొన్ని మంచి పనులు, మరికొన్ని చెడు పనులు చేశారని టిజి వెంకటేష్ అన్నారు.
వైయస్ బొమ్మను పెట్టే విషయంలో పార్టీలో అంతా ఒకే విధానంలో ముందుకు వెళ్లాలని అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డితో పాటు గతంలో పలువురు నేతలు పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారని ఆయన గుర్తు చేశారు. వారందరి ఫోటోలు పెట్టలేం కదా అని ఆయన ప్రశ్నించారు. తమ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారవడానికి జగన్మోహన్ రెడ్డియే కారణమని ఆరోపించారు.












Click it and Unblock the Notifications