హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నకిలీ బంగారంతో బ్యాంకుకు రూ.2.30 కోట్లు టోకరా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గురువారం ఓ ఘరానా మోసం బయటపడింది. నకిలీ బంగారంతో ఏకంగా ఓ బ్యాంక్‌నే బురిడీ కొట్టించిన సంఘటన చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు నకిలీ బంగారాన్ని నేరెడ్‌మెట్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తాకట్టు పెట్టి రూ.2.30 కోట్లు తీసుకున్నారు. అది నకిలీ బంగారం అని తెలుసుకున్న బ్యాంకు అధికారులు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నకిలీ బంగారం తాకట్టు పెట్టిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం అల్లిగూడెంలో కారులో తరలిస్తున్న మూడు బస్తాల గంజాయిని అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. అయితే దీనికి బాధ్యులైన నిందితులు పరారీలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

కాగా చిత్తూరు జిల్లాలోని తిరుమలలో ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తున్న ఏడుగురు దొంగలను అటవీ శాఖ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తిరుమల పాప వినాశనం సీపంలో వీరు ఎర్ర చందనం స్మగ్లర్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.20 లక్షల విలైవన ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అటవీ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. వారి నుండి మూడు టన్నుల చందనం దుంగల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఇద్దరు వ్యక్తులను కందూకురు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వీరి నుండి రూ.9 లక్షల విలువ చేసే బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ రఘురామి రెడ్డి డిఎస్పీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. 2010 జనవరి అర్దరాత్రి పట్టణంలోని మస్తాన్ జ్యూవెల్లర్సులో రూ.76 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు చోరీ జరిగిందన్నారు. గతంలో రూ.లక్షా పాతిక వేలు రికవరీ చేసినట్లు తెలిపారు.

English summary
Three people cheated a bank with duplicate gold in Hyderabad. Accused persons arrested by city police on tuesday. They Gage duplicate gold in Bank of India at Neredmet and took Rs.2.30 crores. Bank officials found and complained against them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X