ఇటాలియన్‌ను విడుదల చేసిన మావోయిస్టులు

Suspense over release of Italian
భువనేశ్వర్: తమ చెరలో ఉన్న ఇటాలియన్‌ బొనుస్కో పౌలోను మావోయిస్టులు ఎట్టకేలకు విడిచిపెట్టారు. ఆయను మావోయిస్టులు మోహోనా గ్రామంలో విడిచిపెట్టినట్లు వార్తలు వచ్చాయి. మార్చి 14వ తేదీ నుంచి ఆయన మావోయిస్టుల చెరలో ఉన్నాడు. అంతుకు అంతకు ముందు - మావోయిస్టుల చెరలో ఉన్న ఇటాలియన్ బొసుస్కో పౌలో విడుదలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయనను మావోయిస్టులు విడుదల చేసినట్లు కొన్ని టీవీ చానెళ్లలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఆయన విడుదలకు మావోయిస్టులు కొత్త డిమాండ్లను ముందుకు తెచ్చినట్లు మరో వైపు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన విడుదలపై అయోమయం నెలకొంది.

ఇటాలియన్ విడుదల చేయడానికి మరో మావోయిస్టు ఆర్తి మంజీని తమకు అప్పగించాలని మావోయిస్టులు డిమాండ్ పెట్టినట్లు ఎన్డీటివీ న్యూస్ చానెల్ అంతకు ముందు ఓ వార్తాకథనం ద్వారా తెలిపింది. ఆర్తి మంజీ బెయిల్ పిటిషన్ గురువారం సాయంత్రం కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. మార్చి 14వ తేదీ నుంచి తమ చెరలో ఉన్న ఇటాలియన్‌ను బుధవారం రాత్రి మావోయిస్టులు వదిలేసినట్లు ముందు వార్తలు వచ్చాయి.

ఇటాలియన్‌ను మోహోననా గ్రామంలో వదిలేశారని ఓ ప్రముఖ వార్తా సంస్థ తెలిపింది. అయితే, ఆయన విడుదలపై అధికారిక సమాచారమేదీ అప్పుడు లభించలేదు. ఒడిషా ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆహ్వానిస్తూ ఇటాలియన్‌ను వదిలేస్తామని గురువారం మావోయిస్టు నేత సవ్యసాచి పాండా చెప్పారు. ఇటాలియన్ బందీని విడుదల చేసినట్లు మావోయిస్టులు ధ్రువీకరించారంటూ తెలుగు టీవీ చానెళ్లలో వార్తలు వస్తున్నాయి.

కాగా, మావోయిస్టు మరో గ్రూప్ చేతిలో బందీగా ఉన్న శాసనసభ్యుడు జినా హికాకా ఇంకా చెర వీడలేదు. హికాకాను మార్చి 24వ తేదీన మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తే తప్ప హికాకాను వదిలేది లేదని వారంటున్నారు. హికాకా విడుదలకు 23 మందిని విడిచి పెట్టేందుకు ఒడిషా ప్రభుత్వం అంగీకరించింది. వీరిలో 8 మంది మావోయిస్టులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+