తారా చౌదరి ఎవరో నాకు తెలియదు: మంత్రి కన్నా

Kanna Laxminarayana
ఖమ్మం: సినీ నటి తారా చౌదరి కేసులో మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ పేరు వెలుగులోకి రావడంతో ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న ఆయనను మీడియా పలకరించింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తారా చౌదరి ఎవరో తనకు తెలియదని మంత్రి స్పష్టం చేశారు. పోలీసులు విచారణపై తనకు పూర్తి నమ్మకముందని ఆయన చెప్పారు. విచారణలో వాస్తవాలు తెలుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. పోలీసులు విచారణ జరుపుతున్నారని, చట్టం తన పని తాను చేసుకు పోతుందని చెప్పారు.

కాగా గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు సెక్స్ రాకెట్ తారా చౌదరితో జరిపిణ సంభాషణల టేపు బయటకు వచ్చిందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మంత్రి కన్నా లక్ష్మీ నారాయణను దెబ్బ తీసేందుకు రాయపాటి తనను వాడుకోవడానికి ప్రయత్నించారని తారా చెప్పిందట.

కన్నా కిడ్నాప్ చేసినట్టు చెబితే రూ.కోటి వరకు ఇస్తానని రాయపాటి తనతో చెప్పారని, అయితే తనకు ఆయన మొహమే తెలియదని, ఆయన గురించి తాను ఎలా చెబుతానని తార చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ అంశంపై కన్నా స్పందిస్తూ తార ఎవరో తనకు తెలియదని చెప్పారు. కాగా ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాయపాటి సాంబశివ రావు అంతకుముందే స్పష్టం చేశారు. దీని వెనుక ఓ కుట్ర దాగి ఉందని రాయపాటి చెప్పారు.

కాగా అమ్మాయిలను వ్యభిచార రొంపిలోకి లాగుతుందన్న ఆరోపణలతో తారా చౌదరి ఇటీవల అరెస్టయిన విషయం తెలిసిందే. ఆమె అరెస్టు పలువురు ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సరస సంభాషణలు, చిత్రాలతో సెల్‌ఫోన్ మెమొరీ కార్డులు నిండిపోతుండటంతో, తార తరచూ వాటిని మార్చేదని తెలిసింది. పోలీసులు ఆమె ఇంట్లో 16 మెమొరీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ మెయిలింగ్ ద్వారా వచ్చిన సొమ్ముతో తార వడ్డీ వ్యాపారం చేసినట్లు తెలిసింది. ఒక చిన్న నిర్మాత రూ.3 లక్షల అప్పు తీర్చకపోవడంతో, తనతో పరిచయం ఉన్న ఇద్దరు పోలీసు అధికారులను రంగంలోకి దించినట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+