హైటెక్ బాబుకు జగన్ కౌంటర్, మోడీ బాటలో

పార్టీ రోజువారీ కార్యకలాపాలతో పాటు ఫోటోలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని మొబైల్ అప్లికేషన్ అందుబాటులోకి తెస్తుంది. చంద్రబాబుపై పైచేయి సాధించడానికి వైయస్ ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతున్నారు. వచ్చే 18 శానససభా స్థానాలు, ఓ లోకసభ ఉప ఎన్నికల్లో దీన్ని ఆయన విస్తృతంగా వాడుకునే అవకాశం ఉంది.
రాష్ట్రంలో మొబైల్ వినియోగదారులు గణనీయంగా పెరుగుతున్నారని, వారందరి చెంతకు చేరడానికి, ప్రత్యేకంగా యువకులను, విద్యార్థులను, స్మార్ట్ ఫోన్ వినియోగదారులను చేరుకోవడానికి ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుందని, వారికి పార్టీకి సంబంధించిన తాజా సమాచారాన్ని చేరవేయడం సులభమవుతుందని, తమ పార్టీకి చెందిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉత్సుకత ప్రదర్శిస్తున్న తెలుగు ఎన్నారైలకు సమాచారం అందించడానికి ఉపయోగపడుతుందని వైయస్ జగన్ అంటున్నారు.
ఇండిసిస్ సిస్టమ్స్ సిఇవో, పార్టీ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం సభ్యుడు సురేష్ బొమ్మ ఆ అప్లికేషన్‌ను రూపొందించారు. గుజరాత్ ముఖ్యమంత్రి కూడా హైటెక్ హంగులు సమకూర్చుకుని ఐమోడీగా పేరు సంపాదించుకున్నారు. మోడీ అప్లికేషన్ బిజెపికి సంబంధించిన దృక్పథాన్ని తెలుసుకోవడానికి, గుజరాత్ ప్రభుత్వంతో సంబంధాలను పెట్టుకోవడానికి సామాన్యులకు ఉపయోగపడుతుంది.












Click it and Unblock the Notifications