రెండు కేసుల్లో నటి తారా చౌదరికి బెయిల్ మంజూరు

అయితే అరెస్ట్ చేసేందుకు తన ఇంటికి వచ్చిన పోలీసులను తారా చౌదరి నెట్టివేసిందట. నెట్టివేసిందంటూ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. దీనిపై విచారించిన నాంపల్లి మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ న్యాయమూర్తి ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. మరో కేసులోనూ ఆమెకు కోర్టు బెయిల్ ఇచ్చింది.
బంజారాహిల్స్ పోలీసులు తారా చౌదరిపై మొత్తం మూడు కేసులు పెట్టారు. మూడు కేసులలో రెండు కేసులలో ఆమెకు బెయిల్ లభించింది. రూ.5వేల సొంత పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలతో ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా అమ్మాయిలను వ్యభిచార రొంపిలోకి దింపిందనే ఆరోపణల నేపథ్యంలో పది రోజుల క్రితం తారా చౌదరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
శనివారం పోలీసులు ఆమెను నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరారు. దీంతో తారా చౌదరిని, ఆమె భర్తను నాలుగు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఆదివారం నుండి బుధవారం వరకు తారా చౌదరిని పోలీసులు విచారించారు. ఈ విచారణలో ఎన్నో విషయాలు వెల్లడైనట్లుగా తెలుస్తోంది. ఈ విచారణలో తారా చౌదరి తనకు ప్రముఖులతో సంబంధాలు ఉన్నట్లు చెప్పిందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications