జగన్ కేసు: సాయి బెయిల్ రద్దుకు సిబిఐ ప్రయత్నాలు

విజయ సాయి రెడ్డి బెయిల్ వెంటనే రద్దు చేయాలని వారు తమ పిటిషన్‌లో కోర్టును కోరారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఎ-2 నిందితుడిగా ఉన్న విజయ సాయి రెడ్డి కీలకమని వారు అందులో తెలిపారు. ఆయన బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని, సాక్ష్యులను బెదిరింపులకు గురి చేసే అవకాశముందని వారు తెలిపారు. జగన్ ఆస్తుల గుట్టు అంతా సాయికి తెలుసు అన్నారు.
ఇప్పటికే ఆయనను ఆరెస్టుకు ముందు విచారమించామని, అరెస్టు తర్వాత కూడా విచారించామని కానీ ఆయన ఎలాంటి సరైన సమాచారం ఇవ్వలేదని వారు కోర్టుకు తెలిపారు. ఆయన బెయిల్ రద్దు చేయకుంటే కేసు తారుమారు అయే అవకాశముందని కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయాలని వారు కోరారు. కోర్టు పిటిషన్ స్వీకరించింది. ఇది మధ్యాహ్నం రెండున్నర గంటలక తర్వాత విచారణకు వచ్చే అవకాశముంది.
కాగా ఈ నెల 13వ తేదిన విజయ సాయి రెడ్డికి సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. విజయ సాయి రెడ్డికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) ఆదివారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో సిబిఐ హౌస్ మోషన్ మూవ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. సిబిఐ పిటిషన్‌ను హైకోర్టు చీఫ్ జస్టిస్ స్వీకరించలేదు. సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications