జగన్ మా ప్రత్యర్థి, వైయస్ మావాడు: వాయలార్ రవి

Vayalar Ravi
హైదరాబాద్: అన్ని పార్టీలలాగే కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా తమకు ప్రత్యర్థియేనని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వాయలార్ రవి మంగళవారం మీడియా సమావేశంలో అన్నారు. ఆయన సాయంత్రం గాంధీ భవనంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కోస్తా ప్రాంతంలో వైయస్ జగన్ ప్రభావం ఎక్కువగానే ఉందని తన దృష్టికి వచ్చిందని, దానిని అధిగమిస్తామని చెప్పారు.

ప్రతిపక్షాలను తట్టుకొని నిలబడతామన్నారు. ప్రతి రెండేళ్లకు కాంగ్రెసు పాలిత రాష్ట్రాలలో అధిష్టానం పరిశీలన చేస్తుందని అందులో భాగంగానే తాను వచ్చానని చెప్పారు. గులాం నబీ ఆజాదే కాంగ్రెసు పార్టీ ఎపి వ్యవహారాల ఇంచార్జి అని చెప్పారు. తాను కేవలం డిప్యూటేషన్ కోసమే వచ్చానన్నారు. ఆజాద్ శాఖారమైన ఒత్తిళ్లలో ఉన్నారని చెప్పారు. అందుకే తాను వచ్చానని చెప్పారు. కాంగ్రెసుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని వదులుకోవాలనే ఉద్దేశ్యం ఏమాత్రం లేదన్నారు.

కిందిస్థాయి నేతలు కొందరు మాట్లాడితే మాట్లాడ వచ్చునని, అధిష్టానానికి మాత్రం లేదన్నారు. ఆయన హయాంలో అవినీతి అంశం మా దృష్టిలో లేదని అది సిబిఐ చూసుకుంటుందని చెప్పారు. ఈ విషయంలో మీడియాకే ఆసక్తి ఎక్కువగా ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స మధ్య విభేదాలు తన దృష్టికి రాలేదని చెప్పారు. ఏమైనా ఉన్నా వాటిని సరిదిద్దుతామని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఇతర పార్టీ నేతలతో మాట్లాడేందుకే తాను హైదరాబాదుకు వచ్చానని చెప్పారు.

తెలంగాణ అంశంపై మూడు ప్రాంతాల నేతల అభిప్రాయాలు తీసుకున్నానని చెప్పారు. తెలంగాణ సమస్య గురించి తనకు పూర్తిగా తెలుసునని చెప్పారు. తనది పూర్తిగా రాజకీయ పర్యటన అని చెప్పారు. కింది స్థాయి నుండి పార్టీ పరిస్థితిని అధ్యయనం వేయడానికే తాను వచ్చానని చెప్పారు. పార్టీని పూర్తిస్థాయిలో పటిష్ట పరచాలన్నదే తన పర్యటన ఉద్దేశ్యమని చెప్పారు. ఉప ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సమాయత్తం చేస్తున్నట్టు చెప్పారు.

అందరు నేతలతో మాట్లాడిన తర్వాతే తాను పార్టీ అధిష్టానానికి నివేదిక ఇస్తానని చెప్పారు. పార్టీలో బేధాభిప్రాయాలు తొలగించి పార్టీని చక్కదిద్దుతానని చెప్పారు. ప్రభుత్వ, పార్టీ పని తీరుపై అభిప్రాయాలు సేకరిస్తున్నానని చెప్పారు. తాను మరో ఒకటి, రెండు రోజులు ఇక్కడే ఉంటానని చెప్పారు. కాంగ్రెసు పాలిత రాష్ట్రాల తీరును అధిష్టానం పరిశీలిస్తోందని, అందులో భాగంగానే ఇక్కడకు వచ్చానని చెప్పారు. నేతల మధ్య ఉన్న బేధాభిప్రాయాలు తొలగిస్తామని చెప్పారు. పరిస్థితిని చక్కదిద్దుతామన్నారు.

ఢిల్లీలో సిఎం: హైదరాబాద్‌లో కెవిపి, బొత్సతో వాయలార్ కాగా అంతకుముందు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దూతగా న్యూఢిల్లీ నుండి వచ్చిన వాయలార్ రవిని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మబంధువు కెవిపి రామచంద్ర రావు మంగళవారం ఉదయం కలిశారు. తాజ్ కృష్ణలో ఉన్న రవిని కెవిపి కలిశారు. పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూడా ఆయనను హోటల్లో కలిశారు. పార్టీ పరిస్థితిపై పాల్వాయి పూర్తిగా వివరించినట్లుగా తెలుస్తోంది.

కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ ఆయనను లేక్ వ్యూ గెస్టు హౌస్‌లో కలిశారు. కాగా వాయలార్ రవి కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, పార్టీ పరిస్థితులపై చర్చించనున్నారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఉన్నప్పుడు రవి హైదరాబాద్ రావడం అనుమానాలకు తావిస్తోందని పలువురు అంటున్నారు. పార్టీలో ఏమైనా మార్పులు చేర్పులు ఉండవచ్చుననే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

రాత్రి మీడియాతో మాట్లాడిన వాయలార్ రవి తాను సోనియా గాంధీ దూతగా వచ్చానని, రాష్ట్రంలోని నేతలు చెప్పింది వింటానని, మేడంకు పూర్తి నివేదికను ఇస్తానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య విభేదాలు ఢిల్లీకి చేరడంతో, పార్టీ పెద్దలు వారిని పిలిపించుకొని సర్ది చెప్పిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత కూడా ముఖ్యమంత్రిపై ఇతర నేతల నుండి అసంతృప్తి వెలువడటం, త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాయలార్ రవి రాక ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ నేతల నుండి అభిప్రాయాలు తీసుకొని ఆయన సోనియా గాంధీకి పూర్తి నివేదిక ఇవ్వనున్నారు. అలాగే ఉప ఎన్నికల అంశంపై నేతలతో చర్చించనున్నారు. కాగా పిసిసి చీఫ్ బొత్సతో రవి భేటీ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+