అవినీతికి ఆదర్శం: డిసిఎంపై బాబు మోహన్ సెటైర్

Babu Mohan
ఒంగోలు: ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అవినీతికి ఆదర్శంగా నిలుస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత, ప్రముఖ సినీ నటుడు బాబూ మోహన్ సోమవారం అన్నారు. నేటి రాజకీయ నాయకులు అవినీతిని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఆయన ప్రకాశం జిల్లాలోని మార్కాపురం చెన్నకేశవనగర్‌లో పల్లాపల్లి కెఎస్ఆర్ రెసిడెన్సీ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అక్రమ ఆస్తులు సంపాదించుకుంటూ అవినీతికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఆరోపించారు. ఆంథోల్ నియోజకవర్గంలో డిప్యూటీ ముఖ్యమంత్రి ఇటీవలే 200 ఎకరాలు కొనుగోలు చేశారని హైదరాబాద్‌లోని లోటస్‌ఫాండ్‌లో కోట్లాది రూపాయలతో భవనాన్ని కడుతున్నారని, సంగారెడ్డిలో జపాన్, చైనా టెక్నాలజీతో ఆధునిక హంగులతో భవనాన్ని నిర్మించారని చెప్పారు.

తాను ప్రస్తుతం ఎనిమిది సినిమాల్లో నటిస్తున్నానని, తన వృత్తి నటనే అని ఆఖరి శ్వాసవరకు జీవిస్తానని చివరకు తన ప్రాణం పోయిన తరువాత కూడా శవాన్ని సినిమాలకు పనికి వస్తే ఉపయోగించుకోవచ్చని అన్నారు. మాయలోడు, సీతారత్నంగారి అబ్బాయి, మామగారు లాంటి సినిమాలు తన కెరీర్‌లో మరిచి పోలేనివని అన్నారు. 8 సినిమాలలో ప్రస్తుతం నటిస్తున్నానని తెలిపారు.

ఈ సమావేశంలో టిడిపి జిల్లా అధికార ప్రతి నిథి జక్కా ప్రకాష్, నిర్వాహకులు సతీష్ మురళి, ప్రసాద్, నీలకంఠేశ్వరరావు, వెంకటే శ్వర్లు, శ్రీనివాసులు పాల్గొన్నారు. కెఎస్ఆర్ రెసిడెన్సీకి భూమిపూజ చెన్నకేశవ నగర్‌లో నూతనంగా నిర్మించనున్న పల్లాపల్లి కెఎస్ఆర్ రెసిడెన్సీకి మాజీ మంత్రి సినీనటుడు బాబుమోహన్ సోమవారం భూమి పూజ నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+