టీవీ నటి ఆత్మహత్యాయత్నం: ఆమె భర్త అరెస్టు

పోలీసుల కథనం ప్రకారం - ఉమా మహేశ్వరికి ఐదు నెలల క్రితం ఓ పాప పుట్టింది. పుట్టింట్లో ఉన్న ఆమె భర్త వద్దకు వచ్చింది. ఆ సమయంలో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ స్థితిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆమెను అరుణ్, ఇరుగుపొరుగువారు కలిసి ఆమె ఆస్పత్రిలో చేర్చారు. పాప పుట్టిన తర్వాతి నుంచి ఆమె తల్లిదండ్రుల ఇంట్లో ఉంటోంది.
కంప్యూటర్ విడిభాగాలు విక్రయించే అరుణ్ తనకు ప్రమాదం జరిగిందని తన భార్యకు చెప్పాడు. దాంతో ఆమె వెంటనే హుటాహుటిన భర్త వద్దకు వచ్చింది. చూసే సరికి అతను బాగానే ఉన్నాడు. దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. గొడవ తీవ్రమైన స్థితిలో ఉమా మహేశ్వరి ఆత్మహత్యకు ప్రయత్నించింది.
తన భార్యకు వేరే పురుషుడితో సంబంధం ఉందని అరుణ్ అనుమానించినట్లు ప్రచారం జరుగుతోంది. దానికితోడు ఉమామహేశ్వరి తల్లిదండ్రులను అతను బంగారం డిమాండ్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications