ఆరు కాళ్లతో పుట్టిన మగబిడ్డ, పాక్‌లో విచిత్రం

అదనపు కాళ్లతో ఆ మగబిడ్డ సుక్కుర్‌లో జన్మించింది. ఆ బిడ్డను కరాచీలోని జాతీయ శిశు ఆరోగ్య సంస్థ (ఎన్ఐసిహెచ్)కు సోమవారం తరలించారు. నిజానికి కవలలు పుట్టారని, ఒక బిడ్డ బాగనే ఉందని, మరో బిడ్డ మాత్రం అదనపు కాళ్లతో పుట్టిందని సంస్థ డైరెక్టర్ రజా చెప్పినట్లు డాన్ పత్రిక రాసింది.
బిడ్డ ప్యారసైట్ కాళ్లతో పుట్టిన బిడ్డను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచినట్లు, అదనపు కాళ్లను తొలగించే ప్రక్రియ క్లిష్టమైంది, సమయం తీసుకునేదని ఆయన అన్నారు. అంతర్గత, కాస్మాటిక్ శస్త్ర చికిత్సలు అవసరమవుతాయని చెప్పారు. ఐదుగురు సర్జన్లు ఈ కేసును చూస్తున్నారు.
బిడ్డ తండ్రి ఇమ్రాన్ అలీ షేక్ (31) ఎక్స్ రే టెక్నిషియన్. అతను అఫ్సాన్ అనే మహిళను ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఈ బిడ్డనే వారికి మొదటి సంతానం. తన బిడ్డను వైద్యులు బతికించాలని అతను కోరుతున్నాడు. తాను పేదవాడనని, తాను సంపాదించిన సొమ్మును తన భార్య అనారోగ్యానికే ఖర్చు చేశానని అతను చెప్పాడు.












Click it and Unblock the Notifications