భార్యతో గొడవపడి ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

Bangalore Map
బెంగళూర్: కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో మగవాళ్ల ఆత్మహత్యలు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మంగళవారం నుంచి బెంగళూర్ పశ్చిమ ప్రాంతంలోని మగది రోడ్డులో నలుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా, బుధవారంనాడు 36 ఏల్ల వ్యక్తి రజనీనగర్ ఆరో బ్లాక్ ఎన్జీవో లేఅవుట్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని మరణించాడు.

ఎం మంజునాథ్ అనే వ్యక్తి ప్రైవేట్ కంపెనీలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేశాడు. హైకోర్టులో స్టెనోగ్రాఫర్‌గా పనిచేస్తున్న తన భార్య మీరా బాయితో గొడవ పడ్డాడు. ఆమె ఉద్యోగం చేయడాన్ని అతను వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. దీనిపైనే వారిద్దరు బుధవారం గొడవ పడ్డారు. ఆ తర్వాత అతను పడక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. చాలా సేపటి వరకు అతను తలుపులు తెరవకపోవడంతో భార్యకు అనుమానం వచ్చి ఇరుగుపొరుగువారిని పిలిచింది. తలుపులు బలవంతంగా తెరిచి చూసే సరికి అతని శవం సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.

అంతకు ముందు మంగళవారం రాత్రి అమర్ కుమార్ అనే 22 ఏళ్ల క్యాబ్ డ్రైవర్ మగధిరోడ్డులోని కెబ్బెహళ్లిలో తన గదిలో ఉరేసుకుని మరణించాడు. అతనిది రాయచూర్ జిల్లా సింధనూరు. అతనికి పెళ్లి కాలేదు. తన మరణానికి ఎవరూ బాధ్యులు కారంటూ అతను ఓ సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. ఆర్థిక సమస్యల వల్లనే అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు.

చెత్త కాగితాలు ఏరుకునే శంకరప్ప అలియాస్ శంకర్ (40) సుంకడకట్టే ప్రధాన రహదారి పక్కన గల చెట్టుకు మంగళవారం రాత్రి ఉరేసికుని మరణించాడు. అతనికి ఇల్లూ వాకిలి లేదు. పేవ్‌మెంట్ల మీదనే అతని జీవితం గడుస్తూ వచ్చింది.

మగధి రోడ్డులోనే శ్రీనివాస నగర్‌లో తన నివాసానికి ఎదురుగా ఉన్న ఇంటిలోని ఓపెన్ సంప్‌లో దుమికి 45 ఏళ్ల కార్పెంటర్ మహదేవాచారి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబం దూరం కావడంతో నిస్పృహకు గురై అతను ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. మంగళవారం సాయంత్రం సమీపంలోని మద్యం దుకాణంలో అతను కనిపించినట్లు చెబుతున్నారు. మద్యం సేవించిన తర్వాత అతను సంప్‌లోకి దూకినట్లు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+