తిరుపతికి ముఖ్యమంత్రి వరాలు, చిరంజీవి ప్రశంసలు

అంత్యోదయ కార్డుల సంఖ్య పెంచుతామని చెప్పారు. తిరుపతిలో మల్టీలెవల్ పార్కింగ్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అదే సమయంలో మీడియాకు ఆయన ఓ సూచన చేశారు. విలేకరులు తాను చెప్పేది స్పష్టంగా విని రాస్తే బాగుంటుందని సూచించారు. రైతులకు చెప్పింది మహిళలకు, మహిళలకు చెప్పింది రైతులకు రాయవద్దన్నారు. ఇక నుండి ఇంటి నిర్మాణం కోసం రూ.85వేలు ఇస్తామని చెప్పారు.
తిరుపతి అభివృద్ధి పనుల కోసం కిరణ్ రూ.147 కోట్లు మంజూరు చేశారు. కొంతమంది దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని, అవేవీ ఆగలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే వారు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
రూ.5250 కోట్లను విద్యార్థులకు ఉపకారవేతనాలుగా చెల్లించామన్నారు. ఎస్సీ, ఎస్టీ నిధులను వారి అభివృద్ధికే ఖర్చు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, ఎమ్మెల్యే కుతూహలమ్మ, ఎంపి చింతా మోహన్, మంత్రులు సి.రామచంద్రయ్య, గల్లా అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు.












Click it and Unblock the Notifications