నాకు ఏ ఆశా లేదు: ముఖ్యమంత్రి పీఠంపై చిరంజీవి

ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఉప ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులను విజయం వైపు నడిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీలోని వారమందరం మరింత సమన్వయంతో ముందుకు వెళుతూ మరిన్ని విజయాలు సాధిస్తామని ఆయన చెప్పారు. రానున్న ఉప ఎన్నికలలో కాంగ్రెసు మెజార్టీ సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు.
ఉప ఎన్నికలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి రెఫరెండం కాదని చెప్పారు. వాయలార్ పర్యటన పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పీఠంపై తనకు ఎలాంటి ఆశా లేదన్నారు. మరికొన్ని నెలల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి, తిరుపతిలో పూర్తిస్థాయిలో తాగునీటి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు.
కాగా ఇటీవల గత కొంతకాలంగా కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి స్థానం నుండి తొలగిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కూడా మారుస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఉప ఎన్నికల వరకు వారికి గడువు ఇచ్చి, ఫలితాలు కాంగ్రెసుకు అనుకూలంగా రాకపోతే వారిద్దరి పదవులకు అధిష్టానం ఎసరు పెట్టనుందనే ఉంది. అయితే ఆ వ్యాఖ్యలను చిరంజీవి ఆదివారం కొట్టి పారేశారు.












Click it and Unblock the Notifications