ప్రియుడితో కలిసి కొడుకును చంపిన కసాయి తల్లి

పుల్లమ్మకు గణేష్‌తో పాటు మరో ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయితే రాజు వీరితో పాటే ఉంటున్నాడు. ఇది నచ్చని గణేష్ తరుచూ తల్లితో గొడవ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో రాజు, పుల్లమ్మ, ఆమె కుమార్తెలు, మనవలు అందరూ కలిసి గణేష్ ఆటోలోనే సరూర్ నగర్‌కు ఈ నెల పన్నెండవ తేదిన వెళ్లారు.
అక్కడ గణేష్, రాజు, పుల్లమ్మ మద్యం తాగారు. అనంతరం వీరి మధ్య గొడవ జరగటంతో గణేష్ తన తల్లితో సహా రాజును కొట్టాడు. దీంతో వారిద్దరూ ఆగ్రహంతో ఆటోలో ఉన్న జాకీతో గణేష్ పైన దాడి చేశారు. అక్కడే ఉన్న కుమార్తెలు తల్లి, రాజును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా వదలని తల్లి, రాజు నైలాన్ తాడుతో గణేష్ కాళ్లు, చేతులు బంధించారు.
అనంతరం ఆటోలో వేసి అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటాక ఇంటికి బయలు దేరి వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న గణేష్ మరణించాడని భావించి చంపాపేటలోని పద్మజా నర్సింగ్ హోం వద్ద పడేసి వెళ్లి పోయారు. స్థానికులు గుర్తించి ఉస్మానియాకు తరలించారు. గణేష్ చికిత్స పొందుతూ ఈ నెల 16వ తేదిన మృతి చెందాడు. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications