కొత్త పత్రిక, టివి: మొన్న వైయస్ నేడు మమతాబెనర్జీ!

టివి ఛానెల్‌కు పశ్చిమ బంగాగా నామకరణం చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని మీడియా సంస్థలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని, అందుకే సొంత పేపర్, ఛానల్‌ను ప్రారంభిస్తున్నట్లు మమత స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వార్షిక పని తీరు నివేదికపై పుస్తకాన్ని విడుదల చేస్తామని చెప్పారు.
కాగా అప్పులపై అంతంత వడ్డీలు కట్టలేమని, మూడేళ్ల పాటు మారటోరియం విధించి మా రాష్ట్రానికి వెసులు బాటు కల్పించాలని కేంద్రాన్ని మరోసారి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఏడాదిగా వినిపిస్తున్న డిమాండే అయినా, ఈసారి మాత్రం ఆమె అల్టిమేటం జారీ చేశారు. 15 రోజుల్లో తమ విజ్ఞప్తిపై స్పందించాల్సిందేదని హెచ్చరించారు. లేదంటే యవ్వారం చెడుతుందని పరోక్ష సంకేతాలు అందించారు.
పశ్చిమబెంగాల్ సిఎస్ అధికారుల సదస్సులో మమత శనివారం పాల్గొన్నారు. గతంలో వామపక్ష ప్రభుత్వం కేంద్రం నుంచి రెండు లక్షల కోట్ల మేర రుణాలను తీసుకున్నదని ఆ భారం మోసే పరిస్థితి తన ప్రభుత్వానికి లేదని మమత తేల్చి చెప్పారు. రాష్ట్రాన్ని దివాలా తీయించే చర్యలను సహించబోమని అన్నారు. వడ్డీలపై మారటోరియం అంశాన్ని ఏడాదిగా ప్రస్తావిస్తున్నా కేంద్రం లో చలనం లేదని, ఇకనైనా స్పందించకుంటే వ్యవహారం పెద్దదవుతుందని పేర్కొన్నారు.
పదే పదే విజ్ఞప్తి చేశానని, తన సహనం నశిస్తోందన్నారు. మా వార్షిక రాబడి 21 వేల కోట్లు కాగా, వడ్డీలకు పోతుంది 22 వేల కోట్లని, రాష్ట్ర ఆదాయమంతా ఇలా వడ్డీలకే పోతుంటే అభివృద్ధి పనులు ఎలా చేపట్టాలని ఆమె ప్రశ్నించారు. అయితే, ఆమె ప్రశ్నను కాంగ్రెస్ తేలిగ్గా తీసి పారేసింది. ప్రతి రాష్ట్రం కేంద్రం నుంచి మరింత సాయం ఆశిస్తుందని మమతకు కూడా అలాంటి అంచనాలు, ఆశలు ఉంటే నిస్పందేహంగా వెల్లడి చేయొచ్చని ఆ పార్టీ ప్రతినిధి మనీశ్ తివారీ అన్నారు.
కాగా గతంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇతర పత్రికలు కాంగ్రెసు పార్టీ అభివృద్ధి పథకాలు సరిగా ఇవ్వడం లేదని, తప్పుడు వార్తలు రాస్తోందని, వాటిని తిప్పి కొట్టి కాంగ్రెసు ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు రెండు పత్రికలు ప్రారంభమవుతున్నాయని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. అందులో ఒకటి ఆయన తనయుడు జగన్‌కు చెందిన సాక్షి కాగా, రెండోది సూర్య పత్రిక. ఆ తర్వాత ఆయన మరణానంతరం జగన్ కాంగ్రెసుకు దూరం కావడం వేరే విషయం.












Click it and Unblock the Notifications