జగన్‌పై దుమ్మెత్తిపోసిన మంత్రులు, సాక్షి పత్రికపై సెటైర్

ఎటువంటి ఎజెండా లేని ప్రాంతీయ పార్టీలు త్వరలో కనుమరుగవుతాయని చెప్పారు. కాంగ్రెసు పాడి గేదె అయితే మిగతా పార్టీలు దున్నపోతు వంటివి అని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతి చెందినప్పుడు జగన్‌కు అనుకూలంగా సంతకం చేసినందుకు ఇప్పుడు తాను చింతిస్తున్నానని మరో మంత్రి తోట నరసింహం అన్నారు. తండ్రి మృతదేహం ఇంటికి చేరకుండానే ఆయన సిఎం పదవి కోసం తహతహలాడారని ఆరోపించారు.
ఆయన తూర్పుగోదావరి రామచంద్రాపురంలో ప్రచారం నిర్వహించారు. జగన్ తీరు చాలా ప్రమాదకరంగా ఉందన్నారు. త్వరలోనే ఆయన భవితవ్యం ఏమిటో తేలుతుందని చెప్పారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే దివంగత ముఖ్యమంత్రి వైయస్ కంటే ఎక్కువ ఏమీ చేయలేరని మరో మంత్రి టిజి వెంకటేష్ అన్నారు.
జగన్‌కు ముఖ్యమంత్రి పీఠంపై అధికార కాంక్ష తప్ప మరొకటి లేదన్నారు. జగన్‌కు చెందిన సాక్షి పత్రికలో ప్రతి వ్యాఖ్య తిరగరాయడం తప్ప ఏదీ కనిపించదన్నారు. తిరగరాయడం మినహా ఆ మీడియాకు మరో పనే లేదని ఎద్దేవా చేశారు. జరిగిన తప్పులు బేరీజు వేసుకుని పాప ప్రక్షాళన చేసుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు.
అవినీతితో లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీద, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మీద దుమ్మెత్తి పోస్తున్నాడని, తానొస్తే రెండేళ్లలో పోలవరం కట్టేస్తా అంటున్నాడని విమర్శించారు. జగన్ తప్పు చేసి కూడా తాను నీతిపరుడన్నట్లు ప్రచారం చేసుకుంటున్నాడని అన్నారు. జగన్ ఎవరి సహకారంతో డబ్బు సంపాదించాడో చెప్పకపోతే అది కాంగ్రెస్ పార్టీకి హానీ చేస్తుందని, అందుకే గతంలో చేసిన తప్పును గుర్తించి, దాన్ని ఒప్పుకోవడం మంచిదేనన్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications