భానుతో నా కొడుకు లింక్ వార్తలపై దర్యాప్తు: సబితా

మద్దెలచెర్వు సూరి హత్య కేసులో దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టబోమని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌ను పట్టుకోవడంలో సిఐడి విజయం సాధించిందని ఆమె ప్రశంసించారు. విజయనగరం సంఘటనను ఆ జిల్లా ఎస్పీ చూసుకుంటారని ఆమె చెప్పారు. విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడున ధర్నా కార్యక్రమం ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే.
భాను కిరణ్‌తో కార్తిక్ రెడ్డికి సంబంధాలున్నాయని చాలా కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. విజయవాడకు చెందిన ఓ సంస్థ వివాదంలో జోక్యం చేసుకున్న సంఘటనలో కూడా కార్తిక్ రెడ్డి పేరు ముందుకు వచ్చింది.












Click it and Unblock the Notifications